నారాయణ్‌ఖేడ్: రాజారాం తండా శివారులో రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్ర గాయాలు , ఆస్పత్రికి తరలింపు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం రాజారాం తండా వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధ హంగిర్గ గ్రామానికి చెందిన గణపతి, కృష్ణ లు బైక్ పై కంగ్టి నుంచి సిద్ధ హంగిర్గ గ్రామానికి వెళ్తున్నారు. రాజారాం తండా వద్ద కుక్క అడ్డు పడి బైక్ అదుపు తప్పి పడిపోయి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.