తాడికొండ: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి ఈనెల 25న ప్రవేశ పరీక్ష: ఏపీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ పి. జోగారావు
ఏపీ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రతి పాఠశాలలో 80 మంది చొప్పున ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.జోగారావు తెలిపారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.