గుంతకల్లు: గుత్తిలో గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం పై ర్యాలీ
గుత్తిలో జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి) పై గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం రోడ్డులోని హీరో షోరూం వద్ద నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గేట్స్ ఎండీ రఘునాథ్ రెడ్డి, డైరెక్టర్ వాణి మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గేట్స్ ప్రిన్సిపాల్ సుధాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.