ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ రోడ్డు మూసివేత
Gudur, Tirupati | Oct 22, 2025 గూడూరు డివిజన్ పరిధిలో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో పంబలేరుకు వరద ఉద్ధృతి పెరిగింది. గూడూరు సాధుపేట సెంటర్ నుంచి ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లే రోడ్డును పోలీసులు మూసివేశారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని రూరల్ ఎస్ఐ తిరుపతయ్య సూచించారు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ నుంచి హైవేపై 2KM మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ ప్రదేశంలో వరద నీటి ప్రవాహంతో ఈ పరిస్థితి ఏర్పడింది