శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని సబ్ స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప తనకల్లు మండల సిపిఐ కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ చార్జీలను పెంచకుండా వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకొని, చార్జీల భారాన్ని ప్రజలకు తప్పించాలని కోరారు.