పుంగనూరు: విజయవాడలో పుంగనూరు విద్యార్థి అదృశ్యం కేసు నమోదు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన మల్లికార్జున కుమారుడు పశుపతి హేమంత్ 16 సంవత్సరాలు విజయవాడలో ప్రవేట్ కళాశాలలోఇంటర్ మొదటి సంవత్సరం చదువుతు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి విజయవాడ కళాశాల నుంచి తప్పిపోయినట్టు కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. కుటుంబ సభ్యులు విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఘటనపై బాలుడు అదృశ్యమైనట్లు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పై ఫోటోలో ఉన్న బాలుడి ఆచూకీ తెలిసినచో పై నంబర్లకు సమాచారం తెలిపాలని కోరారు. ఘటన ఆదివారం మధ్యాహ్నం ఒక గంటకు వెలుగులో వచ్చింది.