కొండపి: టంగుటూరు మండలంలో పలు లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని హెచ్చరిక
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం పలు లాడ్జిలను ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అనుమానస్పదంగా వచ్చి లాడ్జిలలో ఉండే వారిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు యాజమాన్యాలకు తెలిపారు. అలానే అపరిచిత వ్యక్తుల లేదా దూరప్రాంతాలనుంచి వ్యక్తుల పూర్తి వివరాలు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు సంబంధిత వివరాలు రిజిస్టర్లు రాసుకొని వారికి గదులను అద్దెకు ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు లాడ్జిల్లా యాజమాన్యాలను హెచ్చరించారు.