జమ్మలమడుగు: బద్వేల్ : పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డిసీసీ బ్యాంక్ చైర్మన్
కడప జిల్లా బద్వేల్ లో దసరా శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని డిసిసి బ్యాంక్ చైర్మన్ మoచూరు సూర్యనారాయణ రెడ్డి, కాంట్రాక్టర్ అరవ శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు ప్రసాద్ లు సాధరంగా ఆహ్వానం పలికి, వాసవి మాత సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువా తో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి శాలలో ఇంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తుండడం సంతోషకరంగా ఉందని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.