పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుంది గుడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
Gudur, Tirupati | Sep 17, 2025 పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండొచ్చని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు జడ్పీ బాయ్స్ హైస్కూల్లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చీపురుపట్టి స్కూల్ ఆవరణాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు