వికారాబాద్: ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు కాలేష్ యాజమాన్యానికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయని, కళాశాలల నిర్వహణకు జీతాలకు భారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పలు పార్టీలు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలుపగా ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.