బోథ్: ఈనెల 14న మండలంలో మంత్రి సీతక్క పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Boath, Adilabad | Dec 13, 2024 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క శనివారం ఈనెల 14న బోథ్ మండలంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో వినోద్ కుమార్, మండల ప్రత్యేక అధికారి వాజిద్ అలీ, తహశీల్దార్ సుభాష్ ఉన్నారు.