కాణిపాకం అనుబంధ దేవాలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోషకాల పూజలు
Chittoor Urban, Chittoor | Sep 19, 2025
కాణిపాకం, స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ మరియు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి సేవలను వీక్షించి ఆనందభరితులయ్యారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, ఆలయ అర్చకులు, వేదపండితులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.