నారాయణ్‌ఖేడ్: పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తే ఊరుకోం : నారాయణఖేడ్లో పవన్ కళ్యాణ్ అభిమానుల హెచ్చరిక
నారాయణఖేడ్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్లో గురువారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదలైంది. ఈ క్రమంలో పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున థియేటర్ వద్ద సందడి చేశారు. సినిమా విడుదల సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఓజి సినిమా పాటలకు అభిమానులు డాన్సులు చేసి అలరించారు. ఓజి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని అభిమానులు కార్యకర్తలు తెలిపారు.