సంతనూతలపాడు: చీమకుర్తి, రామతీర్థం, మర్రి చెట్ల పాలెం కు చెందిన లారీలు, హక్కులు క్రషర్ యజమానులతో సమావేశమైన ఉప రవాణా శాఖ కమిషనర్ సుశీల
చీమకుర్తి: ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఒంగోలులో ఆదివారం ఉప రవాణా శాఖ కమిషనర్ ఆర్ సుశీల, డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జువాలజీ టి రాజశేఖర్ చీమకుర్తి రామతీర్థం మరి చెట్ల పాలెం తదితర ప్రాంతాల నుండి అధికలోడుతో ప్రయాణించే లారీలు, ట్రక్కులు, క్రషర్ యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రానైట్ మరియు కంకర రాళ్లతో అధికలోడుతో వాహనాలు వెళ్లడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని, రహదారి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. అధికలోడుతో వెళ్లే వాహనాలకు విధిగా టార్ఫిలిన్ పట్టలను కట్టాలన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పమన్నారు.