వికారాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
వికారాబాద్ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు చేయాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులు ప్రజలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా రెండు లక్షల 46,725ఎకరాలలో పత్తి సాగు అయినదని రైతులందరూ తమ బ్యాంకు అకౌంట్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకొని విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు