పాడేరు ఘాట్ లో వరుస ప్రమాదాలు...
గాట్ రోడ్డు లో తుప్పలు పెరగడం ప్రమాదాలకు కారణమని స్థానికుల ఆరోపణ
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కార్లు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు లో ఇరువైపులా తుప్పలు పెరిగిన కారణంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని వాహన చోధకులు కోరుతున్నారు.