కుప్పం: గుడిపల్లి వద్ద హంద్రీనీవాకు గండి
గుడిపల్లి మండలం ఇరిసిగానిపల్లి సమీపంలో హంద్రీనీవా కాలువకు గండిపడటంతో నీళ్లు వృధాగా పోతున్నాయి. దీంతో స్పందించిన అధికారులు హంద్రీనీవా నీటిని గుడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని చెరువులకు మళ్లించారు. గండిపడ్డ చోట సిమెంట్ కాంక్రీట్ పనులు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గండిపడినట్లు తెలుస్తోంది.