గండిపేటలోని ఫ్రంట్ లైన్ సెవెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వచ్చిన కియా కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.