పాణ్యం: కల్లూరు అర్బన్‌లో సిపిఎం నేతల ధర్నా పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్
కల్లూరు అర్బన్ 23వ వార్డు సిపిఎం పార్టీ నేతలు అర్హులైన పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం జగన్నాథ్ గట్టు ఇళ్లలో రోడ్లు, కాలువలు, త్రాగునీరు, కరెంట్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని న్యూ సిటీ నగర కార్యదర్శి టి.రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు, తదితరులు ధర్నా నిర్వహించారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను, కరెంట్ చార్జీల పెరుగుదలను కూడా తీవ్రంగా అభ్యంతరించారు.