అమరావతిలోని జగనన్న కాలనీలు అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి: సీపీఎం నాయకులు
అమరావతిలోని జగనన్న కాలనీలు అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయని సీపీఎం మండల కార్యదర్శి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు కాలనీలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ఇళ్లను నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదని వారు సీపీఎం బృందానికి తెలిపారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.