నారాయణపేట్: సిపిఐ పార్టీ వందేళ్ళ శతాబ్ది ఉత్సవాలు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో బుధవారం సిపిఐ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కౌన్సిల్ సభ్యులు పి.వెంకటేష్ అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ హాజరై మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నదని అన్నారు. డిసెంబర్ 26 న ఖమ్మం లో జరగా బోయే శతాబ్ది వందేళ్ళ ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఇంటికి ఒకరు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.