మంత్రాలయం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రాలయంలో స్థలం కేటాయించాలి : దళిత బహుజన సంఘాలడిమాండ్
మంత్రాలయం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రాలయం లో స్థలం కేటాయించాలని దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దళిత బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించాలన్నారు. దీని కోసం దళిత బహుజన సంఘాలు ఐక్యంగా పోరాడాలన్నారు.