కుక్క అడ్డు రావడం వల్ల వేరువేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలలో నలుగురు గాయపడ్డారు. రాయదుర్గం మండలం కదిరంపల్లి సమీపంలో శనివారం మద్యాహ్నం కుక్క అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి నేత్రపల్లి గ్రామానికి చెందిన మదార్ సాబ్ గాయపడ్డాడు. రాత్రి బిటిపి గ్రామం వద్ద కుక్క అడ్డురావడంతో బైక్ పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.