ఐనవోలు: అయినవోలు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయ నందు దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అమ్మ వారు స్కందమాత అలంకారం
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయ నందు దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అమ్మ వారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనం మిచ్చారు. నిత్యాహ్నికము, నవావర్ణార్చన, బావనోపనిషత్పారాయణము చండీ సప్తశతి పారాయణం, చండీహవనం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.