జమ్మలమడుగు: చిలమకూరు : గ్రామంలో యానాది కాలనీ పక్కా గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి - వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం చిలమకూరు యానాది కాలనీలో 40 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న పక్కా గృహాలు పూర్తిగా దెబ్బతిని శిథిలాల వ్యవస్థకు చేరుకున్నాయని వెంటనే ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేసి ఆర్థిక సహాయం అందించాలని బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ ఎస్టి కాలనీ సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కాలనీవాసులు 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన మట్టిమిద్దెలలో నివాసం ఉన్నారన్నారు.