మెదక్: గ్రామ కార్మికుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది : సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి
Medak, Medak | Sep 18, 2025 రామాయంపేట మండల కేంద్రం లోని ఏంపిడివో కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమంనిరసన కార్యక్రమం చేపట్టారు. లక్ష్మాపూర్ గ్రామనికి చెందిన పంచాయతీ కార్మికులు నర్సింలు బోరు మోటర్ రిపేర్ చేయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన నర్సింలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రామ్ వ్యక్తం చేశారు సకాలంలో పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు పస్తులు ఉండి వెట్టిచాకిరి చేస్తున్నారని ఆమె అన్నారు.