అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 1000 మంది విద్యార్థులు జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అని నినాదంతో స్టేట్ బ్యాంక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టోల్గేట్ వద్ద మానవహారం చేపట్టి తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.