శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపాలిటీ కాజీపేట పంప్ హౌస్ కాలనీలోకి చేరిన వరద నీరు పై స్పందించిన ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం మున్సిపాలిటీలోని అరసవిల్లి 26వ డివిజన్ కాజీపేట పంపు హౌస్ కాలనీకి వరద నీరు వచ్చి చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి ప్రవహిస్తున్న గెడ్డ గట్టుకు సోమవారం రాత్రి గండి పడింది. దీంతో కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. జేసీబీతో అధికారులు అక్కడకు చేరుకొని నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.