ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అర్బన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 10 ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించినట్లు సిఐ వెల్లడించారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్క వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేదంటే వారికి జరిమానా విధిస్తామని సీఐ సురేష్ హెచ్చరించారు.