భువనగిరి: ఆయుష్మాన్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి:డిప్యూటీ డిఎంహెచ్వో శిల్పినీ
యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ శిబిర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శిల్పిని అన్నారు ఈ సందర్భంగా సోమవారం బీబీనగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు .ఈ శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని మౌనిక రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు.