రాయదుర్గం: పట్టణంలో ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ల దగ్గర తృటిలో తప్పిన ప్రమాదం
రాయదుర్గం పట్టణం కణేకల్ రోడ్డు లో R&B అధికారులు కొత్తగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ లు గమనించక ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వాహనం కుదుపునకు గురై పైన ఉన్న పైపులు రోడ్డుమీద పడి చెల్లాచెదురుగా పడ్డాయి. గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ ఇతర వాహనదారులు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హెచ్చరిక బోర్డులు, జీబ్రా మార్కింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.