కదిరి నియోజకవర్గం వ్యాప్తంగా బాలిక విద్యా సంరక్షణ పై అవగాహన ర్యాలీ
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం మండలాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లచెరువు, తలుపుల, కదిరి మండలం పరిధిలో విద్యార్థులు, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని ర్యాలీ చేపట్టారు. ఆడపిల్లలను రక్షించుకోవడం, చదివించుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు.