దర్శి: రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన దొనకొండ ఎస్ఐ త్యాగరాజు
Darsi, Prakasam | Sep 17, 2025 ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాలపై, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు ఎస్ఐ త్యాగరాజు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.