యర్రగొండపాలెం: గంగాపాలెం సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు తెలిపారు. అందుకు సంబంధించిన సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో జంగిల్ క్లియరెన్స్ చేశామన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్ విధానంలో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సంబంధిత ప్రాంతాన్ని ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తో కలిసి పరిశీలించామన్నారు.