పులివెందుల: కూటమి ప్రభుత్వం విమర్శలు శోచనీయం : చక్రాయపేట వైసిపి జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి విమర్శ
Pulivendla, YSR | Sep 16, 2025 ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఎంతో అత్యాధునిక,సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారని చక్రాయపేట మండలం జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య ధోరణి వహించారని కూటమి ప్రభుత్వం విమర్శించడం ఎంత వరకు సమంజసమని అన్నారు.మాజీ ముఖ్యమంత్రి విద్య,వైద్యం పట్ల ఎంతో శ్రద్ద కనబరిచారన్నారు.నాడు - నేడు కింద గవర్నమెంట్ స్కూల్ లను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిర్మించారని పేర్కొన్నారు.