మాజీ మంత్రి బుగ్గనను విమర్శించే అర్హత టిడిపి నాయకులకు లేదు: బేతంచర్ల మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి
Dhone, Nandyal | Sep 25, 2025 డోన్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని బేతంచర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, వైసీపీ నాయకులు మురళీకృష్ణ, నాగరాజు, జాకీర్, వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. చేతనైతే అభివృద్ధి చేయాలే తప్ప విమర్శలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.