కృష్ణాజిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు
Machilipatnam South, Krishna | Sep 15, 2025
కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా ఐపీఎస్ అధికారి వి.విద్యాసాగర్ నాయుడు సోమవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో స్తానిక మచిలీపట్నం పొలీస్ పెరేడ్ గ్రైండ్ నందు గల ఎస్పి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. తొలుత సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలువురు పోలీస్ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.