హైదరాబాదులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ని తాడిపత్రి రూరల్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వెంకటరెడ్డిని తాడిపత్రి కి తీసుకొస్తున్నారని సమాచారంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టౌన్ సీఐ ఆరోహణరావు, ఎస్సై గౌస్ నేతృత్వంలో స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా బందోబస్తు కొనసాగింది.