వర్ని: గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పని చేయాలి ; మోస్రా లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో మోస్రా, చందూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం రెండు గంటలకు సమావేశమైన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ సముచిత స్థానం కల్పిస్తామని వ్యక్తం చేసారు పార్టీ కోసం కలిసి పనిచేయాలని సూచించారు.