వేపూరి కోట వద్ద కారును ఢీకొన్న లారీ ఇద్దరు మృతి.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలం వేపూరి కోట సమీపంలో బుధవారం ఉదయం కారును లారీ ఢీకొనడంతో కారులో మదనపల్లెకు వస్తున్న సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి అక్కడే చెందారు. ఘటన స్థలానికి సీఐ వెంకటేశులు , పోలీస్ సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించి విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.