రాజానగరం: రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17న “యాత్రి సేవా దివస్ – 2025” వేడుకలు డైరెక్టర్ శ్రీకాంత్
రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17, 2025 (బుధవారం)న యాత్రి సేవా దివస్ – 2025ను ఘనంగా నిర్వహించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్.కె. శ్రీకాంత్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో అన్ని విమానాశ్రయాలు ఈ దినోత్సవాన్ని ఒకేసారి నిర్వహించనున్నాయన్నారు.