వికారాబాద్: దేశ సేవ దేశ అభివృద్ధికి పాటుపడాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పోలీస్ల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని అన్నారు బ్రిటిష్ వారి నుండి భారత జాతిని విముక్తి చేసినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానంలో మెజార్టీ సంస్థలు భారతదేశంలో విలీనమయ్యాయి అన్నారు