శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ సమీపాన శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆటోను ఢీకొన్న లారీ ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీరాములు అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సోమేందపల్లి నుండి పెనుగొండకు ఆటోలో వెళుతుండగా పెనుగొండ ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.