వనపర్తి: భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి గర్వకారణం అన్న వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మిలాద్ ఉన్ నబీ వేడుకలను వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పండగ శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో స్నేహభావంతో మెలగాలని వనపర్తి జిల్లాలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు గణేష్ నిమజ్జనం ఉన్నందున వాయిదా వేసుకుని నేడు కొనసాగిస్తున్నందుకు అభినందించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎండి బాబా చాంద్ పాషా గౌస్ తదితరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.