ఆలూరు: ఆలూరులో గోపుర ప్రతిష్ఠ: ఎంపీ నాగరాజు పూజలు
Alur, Kurnool | Nov 3, 2025 ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామంలోని శ్రీ హుచ్చు వీరప్ప తాత స్వామి దేవాలయంలో సోమవారం గోపుర ప్రారంభోత్సవం, ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎంపీ నాగరాజు గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.