వ్యాపార లావాదేవీల్లో మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దాల్ మిల్ సూరి అరెస్ట్
వ్యాపార లావాదేవీల్లో పలు మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన దాల్ మిల్ సూరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్ సూరి కి సంబంధించి పలు కేసుల వివరాలను వెల్లడించారు. దాల్ మిల్ సూరి పై శ్రీ సత్యసాయి జిల్లాలో 26 కేసులు,రాష్ట్రవ్యాప్తంగా మరో 26 కేసులు నమోదయ్యాయి అన్నారు. అదేవిధంగా ఒక ఆస్తి తగాదాకు సంబంధించి కొందరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో 307 కేసు నమోదయిందన్నారు.