మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఉచిత బస్సు సర్వీస్ స్త్రీ శక్తి పథకం విజయవత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ హిట్ అయింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.