భీమవరం: పట్టణంలో ఘనంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలిదిండి సుజాత మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా, బండి రమేష్‌కుమార్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 13 మంది డైరెక్టర్లు కూడా పదవీ స్వీకారం చేశారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ నూతన పాలకవర్గం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేసి, రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని సూచించారు.