చీరాల: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి కసరత్తు, చీరాల ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన ప్రాంతీయ చైర్మన్ సురేష్ రెడ్డి
ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు చేపట్టామని ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ సురేష్ రెడ్డి శనివారం చీరాలలో చెప్పారు.ఈ క్రమంలో ఆయన చీరాల ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి ఇక్కడ అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.చీరాల ఆర్టీసీ డిపో రోజూ వారి ఆదాయం,అందులో మహిళా ప్రయాణికుల వాటా తదితర అంశాలను డి.ఎం శ్యామల కుమారి తో చర్చించారు.