రాయదుర్గం: కురువళ్ళి గ్రామంలో 8 ఎకరాల్లో సాగుచేసిన జొన్న పంటను ధ్వంసం చేసిన దుండగులు
బొమ్మనహాల్ మండలం కురవల్లిలో మహిళా రైతు రత్నమ్మకు చెందిన జొన్న పంటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని వాపోయింది. రత్నమ్మ 8 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పంటను ధ్వంసం చేశారంటూ బాధిత మహిళ బొమ్మనహాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై నబీ రసూల్ సిబ్బందితో కలిసి పంటను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.